గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినుర వేమ
— వేమన, వేమన శతకం
VV ka Vichar:
మంచి ఆవు పాలు గరిటెడు అయినా చాలు, గాడిద పాలు కుండెడు ఉన్నా వ్యర్థమే. అభిమానంతో పెట్టిన పిడికెడు అన్నం చాలు, ప్రేమ లేని విందు కూడా వృథా. పరిమాణం కాదు, నాణ్యతే, మనసే విలువైనది.
