ఇనుము విరిగినేని ఇరుమారు ముమ్మారు కాచి యతుకనేర్చు కమ్మరీడు మనసు విరిగినేని మరి యంటునా విశ్వదాభిరామ వినుర వేమ
— వేమన, వేమన శతకం
VV ka Vichar:
విరిగిన ఇనుమును కమ్మరి రెండు మూడు సార్లు కాల్చి అతికించగలడు. కానీ ఒకసారి విరిగిన మనసును మళ్ళీ అతికించడం కష్టం. మాటలతో ఎవరి హృదయాన్నీ గాయపరచకూడదు — సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
