వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్ కని కల్ల నిజము దెలిసిన మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ
— బద్దెన, సుమతీ శతకం
VV ka Vichar:
ఎవరు ఏమి చెప్పినా వినాలి, కానీ విన్న వెంటనే తొందరపడకూడదు. బాగా ఆలోచించి, నిజమేదో అబద్ధమేదో తెలుసుకున్నవాడే లోకంలో నీతిమంతుడు. వివేకంతో సత్యాన్ని గ్రహించడమే జ్ఞానం.
